టైటాన్స్ గెలుపు బాట
ఐపీఎల్-19లో మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ రెండు ఓటముల తర్వాత గెలుపు బాట పట్టింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఆ జట్టు.. చెన్నై సూపర్ కింగ్స్‌ను తమ సొంత వేదికలోనే 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ఈ సీజన్లో నాలుగో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.
- చెన్నైకి సొంతగడ్డపై మరో పరాభవం
- సాయి ధనాధన్ మెరుపులు
చెన్నై: ఐపీఎల్-19లో మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ రెండు ఓటముల తర్వాత గెలుపు బాట పట్టింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఆ జట్టు.. చెన్నై సూపర్ కింగ్స్‌ను తమ సొంత వేదికలోనే 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ఈ సీజన్లో నాలుగో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. మొదట రబాడా (3/25), అర్షద్ ఖాన్ (2/43) కట్టడి చేయడంతో సీఎస్కే 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 158 రన్స్ చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 74 నాటౌట్, 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) మినహా మిగిలినవారంతా చేతులెత్తేశారు. ఛేదనను జీటీ.. 16.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని పూర్తిచేసింది. సాయి సుదర్శన్ (46 బంతుల్లో 87, 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) ధనాధన్ బాదుడుకు తోడు జోస్ బట్లర్ (30 బంతుల్లో 30 బంతుల్లో 39 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్స్), శుభ్‌మన్ గిల్ (23 బంతుల్లో 33, 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు.
రుతురాజ్ ఒక్కడే..
పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి ఆరంభం నుంచే ఆత్మరక్షణ ధోరణిలో ఆడిన సీఎస్కే.. ఆ తర్వాత ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. రబాడా నాలుగో ఓవర్లోనే శాంసన్ (11), ఉర్విల్ (4)ను ఔట్‌చేసి చెన్నైకి డబుల్ షాకులివ్వగా మరుసటి ఓవర్లో సిరాజ్.. సర్ఫరాజ్‌ను డకౌట్ చేయడంతో పవర్ ప్లేలో ఆ జట్టు 28/3తో నిలిచింది. ఆదుకుంటాడనుకున్న బ్రెవిస్ (2)ను సుతార్ వెనక్కిపంపగా మూడు బౌండరీలు, ఒక ఫోర్‌తో కాస్త వేగంగా ఆడినట్టే కనిపించిన శివమ్ దూబె (22)ను అర్షద్ క్లీన్‌బౌల్డ్ చేయడంతో సీఎస్కే కష్టాలు రెట్టింపయ్యాయి. రుతురాజ్ క్రీజులో ఉన్నా అతడు వికెట్‌ను కాపాడుకుంటూ నెమ్మదిగా ఆడటంతో చెన్నై స్కోరు 16 ఓవర్లకు వంద పరుగుల మార్కును దాటింది. సిరాజ్ ఓవర్లో సింగిల్‌తో 49 బంతుల్లో ఈ సీజన్లో తొలి హాఫ్ సెంచరీ సాధించిన గైక్వాడ్ ఆఖర్లో మెరుపులు మెరిపించడంతో తన జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.
టైటాన్స్ ధనాధన్
స్వల్ప లక్ష్యాన్ని టైటాన్స్ దూకుడుగా ఆరంభించింది. మొదట్నుంచే గిల్, సుదర్శన్ ప్రత్యర్థి బౌలర్లపై సిక్స్‌లు, బౌండరీలతో విరుచుకుపడి ఆ జట్టు గెలుపునకు మంచి ఆరంభాన్ని అందించారు. మూడు సిక్స్‌లతో జోరుమీద కనిపించిన గిల్‌ను నూర్ తన తొలి ఓవర్లోనే బోల్తా కొట్టించడంతో టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ నిష్క్రమించినా ఆ ప్రభావం ఛేదనపై పడకుండా బట్లర్ అండతో సాయి రెచ్చిపోయాడు. 33 బంతుల్లో అర్ధ శతకం పూర్తయిన తర్వాత అతడు మరింత దూకుడుగా ఆడాడు. గుర్జన్‌ప్రీత్ ఓవర్లో బంతిని రెండుసార్లు స్టాండ్స్‌లోకి పంపిన సాయి.. విజయానికి 8 పరుగుల దూరంలో పెవిలియన్ చేరినా బట్లర్ పని పూర్తిచేశాడు.
సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 20 ఓవర్లకు 158/7 (రుతురాజ్ 74*, దూబె 22, రబాడా 3/25, అర్షద్ 2/43); గుజరాత్: 16.4 ఓవర్లకు 162/2 (సాయి 87, బట్లర్ 39*, నూర్ 1/29, అకీల్ 1/46)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

