IPL 2025 : వాంఖడేలో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) బౌలర్లు చెలరేగుతున్నా.. ఫీల్డింగ్‌లో మాత్రం నిరాశపరుస్తున్నారు. పవర్ ప్లేలోనే ఏకంగా మూడు క్యాచ్‌లు వదిలేశారు. దాంతో, ముంబై పవర్ ప్లేలో2 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. విల్ జాక్స్(30 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(16 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడిన ముంబైకి సిరాజ్ ఆదిలోనే షాకిచ్చాడు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రియాన్ రికెల్టన్(2)ను సిరాజ్ ఔట్ చేశాడు. అయితే..ఆ తర్వాత బంతికే విల్ జాక్స్(30) ఇచ్చిన సులువైన క్యాచ్‌ను సుదర్శన్ నేలపాలు చేశాడు. లైఫ్ లభించడంతో జాక్స్ బౌండరీలతో రెచ్చిపోయాడు. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో మూడేసీ ఫోర్లతో అలరించాడు. అయితే.. కాసేపటికే అర్షద్ ఓవర్లో పెద్ద షాట్ ఆడే క్రమంలో ప్రసిధ్ చేతికి చిక్కాడు హిట్‌మ్యాన్. దాంతో 26 వద్ద ముంబై రెండో వికెట్ పడింది.
And that’s the end to the powerplay!
Mumbai Indians rebuild after two early wickets and are 56/2 👌
Updates ▶ https://t.co/DdKG6Zn78k #TATAIPL | #MIvGT pic.twitter.com/waIE2DSYZu
— IndianPremierLeague (@IPL) May 6, 2025
మరో ఎండ్‌లో ధాటిగా ఆడుతున్న సూరయకుమార్ యాదవ్(16) ఇచ్చిన క్యాచ్‌ను సాయి కిశోర్ అందుకోలేకపోయాడు. ఇక పవర్ ప్లే చివరి ఓవర్లో జాక్స్ లెగ్‌సైడ్ గాల్లోకి లేపిన బంతిని సిరాజ్ ఒడిసిపట్టుకోలేకపోయాడు.