GT vs RCB | టాస్ గెలిచిన గుజరాత్.. ఆర్సీబీకి అడ్డుందా..!
GT vs RCB : ప్లే ఆఫ్స్ రేసు ఉత్కంఠ రేపుతున్న వేళ గుజరాత్ టైటాన్స్(GT)ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఢీ కొడుతోంది. హోరీహోరీ పోరు ఖాయమనిపిస్తున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్ బౌలింగ్ తీసుకున్నాడు.
GT vs RCB : ప్లే ఆఫ్స్ రేసు ఉత్కంఠ రేపుతున్న వేళ గుజరాత్ టైటాన్స్(GT)ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఢీ కొడుతోంది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో విజయంపై గుజరాత్ ధీమాతో ఉంది. కానీ, గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 75కే మడతపెట్టిన ఆర్సీబీ బౌలర్లు అదే ఊపులో గుజరాత్ బ్యాటింగ్ దళాన్ని పడగొట్టాలనే కసితో ఉన్నారు. హోరీహోరీ పోరు ఖాయమనిపిస్తున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్ బౌలింగ్ తీసుకున్నాడు.
పంతొమ్మిదో సీజన్లో దుమ్మురేపుతున్న ఆర్సీబీ ఈసారి గుజరాత్ టైటాన్స్ భరతం పట్టేందుకు సిద్ధమమైంది. ఢిల్లీ గడ్డపై 8 పరుగులకే ఆరు వికెట్లు తీసిన భువనేశ్వర్, హేజిల్‌వుడ్ జోడీ అహ్మదాబాద్‌లోనూ వికెట్ల వేటతో ప్రత్యర్థిని దెబ్బతీయాలని భావిస్తోంది. ఏప్రిల్ 5న బెంగళూరు చేతిలో 43 పరుగుల తేడాతో చిత్తైన గుజరాత్ ప్రతీకారం తీర్చుకోవానుకుంటోంది.
🚨Toss update from Ahmedabad🚨@gujarat_titans won the toss and elected to bowl first against @RCBTweets
Updates ▶️ https://t.co/I5Hg8ybefh#TATAIPL | #KhelBindaas | #GTvRCB pic.twitter.com/450Bjfi6AI
— IndianPremierLeague (@IPL) April 30, 2026
ఆర్సీబీ తుది జట్టు : విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్, పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేశ్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, హేజిల్‌వుడ్, సుయాశ్ శర్మ.
ఇంప్యాక్ట్ సబ్స్ – రసిక్ దారు సలాం, జోర్డాన్ కాక్స్, మంగేశ్ యాదవ్, వికీ ఓత్స్వల్, వెంకటేశ్ అయ్యర్.
గుజరాత్ తుది జట్టు : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్(వికెట్ కీపర్), హోల్డర్, షారుక్ ఖాన్, సుందర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రబడ, సిరాజ్, మానవ్ సుతార్.
ఇంప్యాక్ట్ సబ్స్ – రాహుల్ తెవాటియా, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, నిశాంత్ సింధు, కుల్వంత్ ఖెజ్రోలియా.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలిస్తే 14 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్తుంది. అదే గుజరాత్ విజయం సాధిస్తే10 పాయింట్లతో ఐదో స్థానంలోనే కొసాగుతుంది. ఎటుచూసినా రెండు జట్లకు ఇది కీలకమైన గేమ్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

