సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో కీలక వికెట్ కోల్పోయింది. ఎయిడెన్ మార్క్రమ్ (56) భారీ షాట్ ఆడే ప్రయత్నంలో వికెట్ కోల్పోయాడు. యష్ దయాళ్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్ చివరి బంతికి అతను భారీ షాట్ ఆడేందుకు ప్రతయ్నించాడు. ఆఫ్‌స్టంప్ ఆవల వేసిన స్లోవర్ బాల్‌ను సరిగా అంచనా వేయలేకపోయిన మార్క్రమ్.. దాన్ని గాల్లోకి ఎత్తుగా కొట్టాడు.
దాన్ని డేవిడ్ మిల్లర్ చక్కగా అందుకోవడంతో మార్క్రమ్ ఇన్నింగ్స్ ముగింపుకొచ్చింది. దీంతో 161 పరుగుల వద్ద సన్‌రైజర్స్ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాతి ఓవర్లోనే లేనిపరుగు కోసం ప్రయత్నించి వాషింగ్టన్ సుందర్ (3) రనౌట్ అయ్యాడు.