వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ జట్లు నువ్వా నేనా అని పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి. గడిచిన ఐదు మ్యాచుల్లో సన్‌రైజర్స్ అన్నింటా గెలుపొందగా.. గుజరాత్‌కు ఒకే ఒక ఓటమి చవిచూసింది. అది కూడా సన్‌రైజర్స్ చేతిలోనే కావడం గమనార్హం. ఇలాంటి నేపథ్యంలో తమ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని గుజరాత్ కసిగా ఉంది.
వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అలాగే తమ జట్టులో ఎలాంటి మార్పులూ లేవని చెప్పాడు. సన్‌రైజర్స్ జట్టులో సుచిత్ స్థానంలో గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ ఆడుతున్నాడని విలియమ్సన్ తెలిపాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
గుజరాత్ టైటన్స్: వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అభినవ్ మనోహర్, లోకీ ఫెర్గూసన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాళ్, మహమ్మద్ షమీ.
🚨 Toss Update 🚨@gujarat_titans have elected to bowl against @SunRisers.
Follow the match ▶️ https://t.co/r0x3cHhUK0#TATAIPL | #GTvSRH pic.twitter.com/ewBEuQZC4Q
— IndianPremierLeague (@IPL) April 27, 2022