గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు జట్టు రెండో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ చేసి నిలకడగా కనిపించిన రజత్ పటీదార్ (52) అవుటయ్యాడు. యువ పేసర్ సంగ్వాన్ వేసిన బంతిని లెగ్‌సైడ్ ఆడటానికి పటీదార్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో స్క్వేర్ లెగ్ ఫీల్డర్ శుభ్‌మన్ గిల్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చాడు. దీంతో అతని అద్భుతమైన ఇన్నింగ్స్ ముగింపుకొచ్చింది. బెంగళూరు జట్టు 110 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. పటీదార్ అవుటవడంతో మ్యాక్స్‌వెల్ క్రీజులోకి వచ్చాడు.