ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ (43) కూడా పెవిలియన్ చేరాడు. లోకీ ఫెర్గూసన్ వేసిన బంతిని పుల్ చేయడానికి పంత్ విఫలయత్నం చేశాడు. టైమింగ్ మిస్ అవడంతో లెగ్ సైడ్ గాల్లోకి లేచిన బంతిని అభినవ్ మనోహర్ చక్కగా అందుకున్నాడు. ఇది ఫెర్గూసన్ ఖాతాలో పడిన మూడో వికెట్ కావడం గమనార్హం.
జట్టు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన పంత్.. నిలకడైన ఆటతీరు కనబరిచాడు. జట్టును విజయతీరాలకు చేర్చేలా కనిపించిన అతను పదిహేనో ఓవర్ తొలి బంతికే అవుటవడంతో ఢిల్లీ విజయావకాశాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం రోవ్మెన్ పావెల్, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు.