న్యూఢిల్లీ : ఈ యేడాది చివరలో జరుగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు భారత సెయిలర్లు నేత్ర కుమరన్, విష్ణు శరవణన్, వరుణ్ టక్కర్, కెసి గణపతి వేర్వేరు దేశాల్లో వివిధ పోటీలలో పాల్గొననున్నారు. వారికి అవసరమైన శిక్షణ, పోటీలలో పాల్గొనేందుకు అవసరమైన ఆర్ధిక సాయం అందించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్(టాప్స్) కింద వీరికి ఈ సాయం అందించనున్నారు. ఈ నలుగురు సెయిలర్లకు రూ.1.5 కోట్లు అవసరమవుతుందని కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు పంపింది.