ముంబై: ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌పై పోరాడి ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కు ఓ గుడ్ న్యూస్. కరోనా బారిన పడ్డాడని అనుకున్న ఆ టీమ్ బౌలర్ అన్రిక్ నోర్కియా తిరిగి టీమ్‌తో చేరాడు. ఆ టెస్ట్ పొరపాటున పాజిటివ్‌గా వచ్చిందని, తాజాగా చేసిన టెస్టులో నెగటివ్‌గా తేలినట్లు ఢిల్లీ టీమ్ చెప్పింది. మై ఆగయా హూ అంటూ హిందీలో నోర్కియా చెప్పిన వీడియోను పోస్ట్ చేస్తూ క్యాపిటల్స్ టీమ్ అతని రాకను తెలియజేసింది.
నోర్కియాకు పాజిటివ్ అని తేలడంతో అతడు రాయల్స్‌తో మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు అతడు క్వారంటైన్లో ఉన్నాడు. ఇప్పటికే గాయంతో శ్రేయస్ అయ్యర్, కొవిడ్‌తో అక్షర్ పటేల్ దూరం కావడంతో కుంగిపోయిన క్యాపిటల్స్ టీమ్‌ను నోర్కియాకు కరోనా వార్త షాక్‌కు గురి చేసింది. అయితే రెండు రోజుల్లోనే అతనికి నెగటివ్ అని తేలడంతో ఊపిరి పీల్చుకుంది.