ఆస్ట్రేలియా క్రికెట్ సూపర్ స్టార్ గ్లెన్ మ్యాక్స్‌వెల్.. తన ప్రేయసి విని రామన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ ఈ నెల 18న క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ఫార్మల్ అవుట్‌ఫిట్స్‌లో మ్యాక్స్‌వెల్, రామన్ ఉన్న ఫొటోను ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేసింది. అయితే వీళ్లిద్దరూ మరోసారి భారతీయ సంప్రదాయంలో కూడా పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది.
ఈ వివాహం ఆదివారం జరిగినట్లు సమాచారం. పెళ్లి కోసం మ్యాక్సీ కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు. పాకిస్తాన్లో ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరమయ్యాడు. అలాగే ఐపీఎల్ ఆరంభ మ్యాచులకు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి దూరంగా ఉంటున్నట్లు తెలిపాడు. క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం అతను ఏప్రిల్ 5 తర్వాతనే ఆర్సీబీ శిబిరంలో చేరతాడు.
తాజాగా మ్యాక్సీ, విని వివాహానికి సంబంధించి వైరల్ అవుతున్న వీడియోలో.. ఆమె సంప్రదాయ పద్ధతిలో చీర కట్టుకొని కనిపిస్తోంది. అదే సమయంలో మ్యాక్స్‌వెల్ షేర్వాణీలో ఉన్నాడు. వెనుక వస్తున్న మ్యూజిక్, వారి దుస్తులను బట్టి చూస్తే ఈ వివాహం తమిళ బ్రాహ్మణ పద్ధతిలో జరిగినట్లు తెలుస్తోంది.
Glenn Maxwell Malai Mattral 🤣 pic.twitter.com/Nu3ikToVRi
— Tinku | ಟಿಂಕು (@tweets_tinku) March 27, 2022