Manchu Manoj | సర్దార్ 2′ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో కార్తీ, విలక్షణ నటుడు ఎస్.జె. సూర్యలతో కలిసి మంచు మనోజ్ చేసిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ ఇంటర్వ్యూలో సూర్య, కార్తీల మధ్య ఉన్న అన్నదమ్ముల అనుబంధం గురించి చర్చిస్తుండగా మంచు మనోజ్ చేసిన సరదా వ్యాఖ్యలు అందరినీ నవ్వించాయి. సూర్య తన తమ్ముడు కార్తీని ఎంత అపురూపంగా చూసుకుంటారో చెప్తున్న సమయంలో, మనోజ్ స్పందిస్తూ అన్నదమ్ముల బంధంపై సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా మనోజ్ నవ్వుతూ.. “సరే, మీ అన్నయ్యను (సూర్య) తీసుకొని నా అన్నయ్యను (విష్ణు) ఇస్తావా?” అంటూ కార్తీని ఫన్నీగా ఒక డీల్ అడిగారు. మనోజ్ చేసిన ఈ సరదా కామెంట్‌కు కార్తీ ఒక్కసారిగా నవ్విస్తూ డీల్ అనడంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు పూశాయి. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్దార్ 2’ సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
బ్రదర్స్ ఎలా ఉండాలో సూర్య, కార్తీ చూపించారు..
మా అన్నయ్యను తీసుకొని, మీ అన్నయ్యని ఇస్తావా?..
కార్తీతో మంచు మనోజ్ డీల్..#Suriya #Karthi #ManchuManoj #Sardar2 #SJSuryah pic.twitter.com/mWZeoxtSx1
— TeluguOne (@Theteluguone) September 7, 2026