Narayanpet | నారాయణపేట జిల్లాలో విషాదం నెలకొంది. మక్తల్ మండలం మంతన్గౌడ్ గ్రామంలో విద్యుదాఘాతంతో 13 ఏళ్ల అక్షర మృతి చెందింది. నీళ్ల మోటర్ ఆన్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అక్షర మంతన్గౌడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.