T20 World Cup 2024 : పొట్టి వరల్డ్ కప్ టైటిల్ ఫేవరెట్ టీమిండియా (Team India) లీగ్‌లో చివరి మ్యాచ్‌కు సిద్దమైంది. ఇప్పటికే సూపర్ 8 చేరిన రోహిత్ శర్మ (Rohit Sharma) బృందం శనివారం కెనడాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టు మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత ఎంపిక చేసిన స్క్వాడ్ నుంచి ఇద్దరిని తప్పించింది. రిజర్వ్ ఓపెనర్‌గా ఎంపికైన శుభ్‌మన్ గిల్ (Shubman Gill), స్పీడ్‌స్టర్ అవేశ్ ఖాన్ (Avesh Khan)లను బృందం నుంచి విడుదల చేసింది. నలుగురు రిజర్వ్ ఆటగాళ్లతో సూపర్ 8 దశకు వెళ్లకూడదని మేనేజ్మెంట్ భావించడమే అందుకు కారణం అని తెలుస్తోంది.
మరోవైపు ఐపీఎల్ హీరో రింకూ సింగ్ (Rinku Singh) జాక్‌పాట్ కొట్టాడు. ట్రావెల్ రిజర్వ్‌గా స్క్వాడ్‌లోకి వచ్చిన రింకూ ఫినిషర్‌గా కరిబియన్ గడ్డపై కాలుమోపనున్నాడు. పేసర్ ఖలీల్ అహ్మద్ (Khaleel Ahmed) సైతం జట్టుతో పాటు సూపర్ 8 మ్యాచ్‌లకు వెస్టిండీస్ వెళ్లనున్నాడు.
‘శుభ్‌మన్ గిల్, అవేశ్ ఖాన్లు బహుశా అమెరికాలో జరిగే గ్రూప్ దశ మ్యాచ్‌లకే పరిమితం కావొచ్చు. ఇది ముందుగా తీసుకున్న నిర్ణయమే. కెనడాతో మ్యాచ్ తర్వాత వీళ్లను స్క్వాడ్ నుంచి తప్పిస్తాం అని బీసీసీఐ (BCCI) వర్గాలు తెలిపాయి. ఓపెనర్‌గా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు బరిలోకి దిగుతుండంతో యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) బెంచ్‌కే పరిమితమయ్యాడు. వీళ్లలో ఎవరు గాయపడినా స్టాండ్ బైగా యశస్వీ ఉండనే ఉన్నాడు. అందుకని గిల్ అవసరం ఇక జట్టుకు లేదని మేనేజ్మెంట్ భావించింది.
ఇక అవేశ్ ఖాన్ విషయానికొస్తే.. ఇప్పటికే భారత్ ముగ్గురు ప్రధాన పేసర్లతో ఆడుతోంది. బుమ్రా, అర్ష్‌దీప్, సిరాజ్‌లు పేస్ త్రయంకాగా.. వీళ్లకు తోడు హార్దిక్ పాండ్యా, శివం దూబేలు బంతిని పంచుకుంటునే ఉన్నారు. దాంతో, మరో పేసర్‌గా అవేశ్‌ను సూపర్ 8 మ్యాచ్‌లకు వెంట పెట్టుకెళ్లడం సమంజసం కాదని బీసీసీఐ ఆలోచన.