హరారె: ముందుగా కింద ఉన్న వీడియో చూడండి. బ్యాట్స్‌మన్ క్రీజులో సిద్ధంగా ఉన్నాడు. బౌలర్ బాల్ వేశాడు. కానీ అంతకుముందే స్టంప్ కదిలి దానిపై ఉన్న బెయిల్ కింద పడిపోయింది. స్టంప్స్‌కు ఇటు బ్యాట్స్‌మన్, అటు వికెట్ కీపర్ చాలా దూరంలో ఉన్నారు. ఆ స్టంప్‌ను కదిలించేంత గాలి కూడా అప్పుడు లేదు. అయినా అది అలా ఎలా కదిలిందో ఎవరికీ అంతుబట్టలేదు. జింబాబ్వే, బంగ్లాదేశ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది.
ఫీల్డ్ అంపైర్లు స్పష్టత కోసం థర్డ్ అంపైర్‌ను అడిగారు. రీప్లేల్లో బ్యాట్స్‌మన్ స్టంప్స్‌కు తగల్లేదని తేలింది. గాలి కారణంగా బెయిల్ కింద పడిందని అనుకున్నా.. స్టంప్ ఎలా కదిలిందో మాత్రం అర్థం కాలేదు. ఈ మిస్టరీ వీడియో చూసిన ట్విటర్ యూజర్లు మ్యాచ్‌లో దెయ్యం వచ్చిందంటూ కామెంట్లు చేశారు.