చెన్నై: జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కెమెర్ చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాడు. ఏడో రౌండ్లో కెమెర్.. అవాండర్ లియాంగ్ (అమెరికా)ను ఓడించాడు. భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి వరుసగా మూడో డ్రాను నమోదుచేశాడు.
ఏడో రౌండ్లో అతడు.. అనీశ్ గిరితో మ్యాచ్‌ను డ్రా చేసుకున్నాడు. 5.5 పాయింట్లతో కెమెర్ తొలి స్థానంలో ఉండగా 4 పాయింట్లతో అర్జున్ రెండో స్థానంలో ఉన్నాడు.