Garry Kirsten : టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ఖరారు కావడంతో అన్ని జట్లు సన్నాహక మ్యాచ్‌లతో బిజీగా ఉన్నాయి. మెగా టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా కోచింగ్ సిబ్బందిని బలోపేతం చేసుకుంటున్నాయి. ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ నమీబియా (Namibia Cricket) క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దిగ్గజ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్(Garry Kirsten)ను తమ జట్టుకు ‘కన్సల్టెంట్’ (Consultant)గా నియమించింది. టీమిండియాకు 2011లో వన్డే వరల్డ్ కప్ కట్టబెట్టిన కిర్‌స్టెన్ నమీబియాను విజయాల బాట పట్టిస్తాడని ఆ దేశ బోర్డు భావిస్తోంది.
పొట్టి క్రికెట్లో సంచలన విజయాలతో దూసుకొచ్చిన నమీబియా 2026 ప్రపంచకప్ పోటీలకు అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీలో ఈ ఆఫ్రికా జట్టు ఆడడం ఇది మూడోసారి. 2021, 2022, 2024 ఎడిషన్లలో పాల్గొన్న నమీబియా ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉంది. సో.. అంతర్జాతీయ క్రికెట్లో కోచ్‌గా సుదీర్ఘ అనుభవమున్న గ్యారీ కిర్‌స్టెన్‌ను కన్సల్టంట్గా తీసుకుంది నమీబియా క్రికెట్. తనను నమీబియా జట్టుకు కన్సల్టంట్గా నియమించడం పట్ల కిర్‌స్టెన్ సంతోషం వ్యక్తం చేశాడు.
Gary Kirsten has been appointed as consultant for the men’s national teams of Namibia and will work with head coach Craig Williams in the build-up to the upcoming T20 World Cup pic.twitter.com/6gr3p2IUsl
— ESPNcricinfo (@ESPNcricinfo) December 7, 2025
‘నమీబియా క్రికెట్‌తో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. క్రికెటర్ల ప్రదర్శన మెరుగవ్వడం కోస అంకితభావం, పట్టుదలగా నమీబియా బోర్డు పనిచేయడం చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. కొత్తగా నిర్మించిన స్టేడియం వారికి క్రికెట్ మీదున్న ఆసక్తికి నిదర్శనం. నమీబియా పురుషుల సీనియర్ సెలెక్టర్ల పనితీరు గొప్పగా ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగబోయే టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉన్న నమీబియాకు నా వంతు సహకారం అందిస్తాను’ అని కిర్‌స్టెన్ వెల్లడించాడు.
ప్రస్తుతం నమీబియా హెడ్‌కోచ్‌గా సేవలందిస్తున్న క్రెగ్ విలియమ్స్‌తో కలిసి కిర్‌స్టెన్ నమీబియా క్రికెట్ బలోపేతానికి కృషి చేయనున్నాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్(Gujart Titans)కు కోచ్‌గా వ్యవహరించిన ఈ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ .. అనంతరం పాకిస్థాన్ కోచ్‌గానూ నియమితులయ్యాడు. కానీ, క్షమశిక్షణలేని పాక్ సీనియర్లు, బోర్డు రాజకీయాలను భరించలేక ఆరు నెలలకే రాజీనామా చేశాడు.