WTC : అండరన్స్ – టెండూల్కర్ ట్రోఫీలో చివరిదైన ఓవల్ టెస్టు (Oval Test)లో భారత జట్టు చిరస్మరణీయ విజయంతో సిరీస్ సమం చేసింది. చరిత్రాత్మక ప్రదర్శనతో డబ్ల్యూటీసీ(WTC )లో మూడో స్థానంలోకి దూసుకొచ్చింది టీమిండియా. అయితే.. ఓవల్ టెస్టులో స్లో ఓవర్ రేటు కారణంగా గిల్ సేనపై నాలుగు పాయింట్లు కోత పడేది. కానీ, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) మాత్రం ‘తగ్గేదేలే’ అన్నట్టు వ్యవహరించడంతో భారత్ కోతను తప్పించుకోగలిగింది.
ఓవల్ టెస్టులో భారత జట్టు ఆరు ఓవర్లు వెనకబడడం మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రొఫే గుర్తించాడు. ఇదే విషయాన్ని కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్‌కు తెలియజేసిన ఆయన.. వీలైనంత త్వరగా కోటా పూర్తి చేయడం లేదంటే నాలుగు కీలక పాయింట్లు కోల్పోవాల్సి వస్తుంది అని హెచ్చరించాడు కూడా. అలాంటప్పుడు స్పిన్నర్లను రంగంలోకి దింపి పాయింట్ల కోత తప్పించుకోవాల్సిన పరిస్థితి.
Time has one bad habit — it always changes. 👏🏻⁰#INDvsENG #INDvsENGTest #OvalTest #TeamIndia #Siraj pic.twitter.com/QK9DrmIC8d
— Kavya Maran (@Kavya_Maran_SRH) August 4, 2025
కానీ.. గౌతీ మాత్రం గెలుపే ముఖ్యం.. పాయింట్ల కోత గురించి ఆలోచించకండి అని టీమ్‌కు చెప్పేశాడు. సో.. ఐదో రోజు ప్రసిధ్, సిరాజ్‌లు మాత్రమే బౌలింగ్ చేశారు. ఈ ఇద్దరిలో సిరాజ్ గొప్పగా రాణించి మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌కు ఊహించని ఓటమిని అందించాడు. దాంతో, మ్యాచ్ పాయింట్లలో కోతకు ఆస్కారమే లేకుండా పోయింది.