IND vs SA : పొట్టి సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో కొనసాగుతున్న భారత జట్టు సిరీస్ పట్టేసేందుకు సిద్ధమైంది. ధర్మశాలలో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన టీమిండియా లక్నో ఏక్నా స్టేడియంలోనూ విజయంపై కన్నేసింది. అయితే.. షెడ్యూల్ ప్రకారం 6:00 గంటలకు వేయాల్సిన టాస్కు పొగమంచు అడ్డుపడింది. ఏక్నా స్టేడియంలో దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో.. టాస్ ఆలస్యంగా వేయనున్నారు. 6:50 గంటలకు పిచ్‌ను పరిశీలించాక టాస్ పడనుంది.
ఫామ్‌లో లేని శుభ్‌మన్ గిల్ పాదం గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. దాంతో మూడు మ్యాచ్‌లుగా బెంచ్‌కే పరిమితమైన సంజూ శాంసన్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. అనారోగ్యంతో చివరి రెండమ్యాచ్లకు దూరమైన అక్షర్ పటేల్ స్థానంలో ఎంపికైన షాబాద్ అహ్మద్ ఆడుతాడా? అనేది తెలియాల్సి ఉంది.
🚨 UPDATE 🚨
Toss in Lucknow has been delayed due to excessive fog.
Next inspection at 6:50 PM.
Updates ▶️ https://t.co/4k14nZK04L#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank
— BCCI (@BCCI) December 17, 2025