Under-19 World Cup | ప్రపంచకప్ జట్టులో నలుగురు భారత కుర్రాళ్లు.. ఆసీస్ నుంచి ఆ ముగ్గురు
Under-19 World Cup : ప్రతిష్ఠాత్మక అండర్ 19 వరల్డ్ కప్ (Under-19 World Cup) టోర్నీ ముగియడంతో ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో(ESPNCricinfo) అండర్ -19 వరల్డ్ కప్ జట్టును ప్రకటించింది. ఈ టీమ్‌లో ఏకంగా నలుగురు భారత కుర్రాళ్లు...
Under-19 World Cup : ప్రతిష్ఠాత్మక అండర్ 19 వరల్డ్ కప్(U-19 World Cup)లో ఆసాంతం అదరగొట్టిన యువ భారత్(Team India) ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఆస్ట్రేలియా సవాల్‌ను అధిగమించలేక రన్నరప్‌తో సరిపెట్టుకుంది. దాంతో, ఆరోసారి టైటిల్ నెగ్గాలనుకున్న టీమిండియా కల కలగానే మిగిలింది. టోర్నీ ముగియడంతో ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో(ESPNCricinfo) అండర్ -19 వరల్డ్ కప్ జట్టును ప్రకటించింది. ఈ టీమ్‌లో ఏకంగా నలుగురు భారత కుర్రాళ్లు ఉన్నారు.
ఈ మోగా టోర్నీలో అద్భుతంగా రాణించిన ఉదయ్ సహరన్(Uday Saharan), ముషీర్ ఖాన్, సచిన్ ధాస్, సౌమీ పాండేలు చోటు దక్కించుకున్నారు. ఇక ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన హగ్ విబ్జెన్, హ్యారీ డిక్సన్, కల్లం విడ్లర్లు ఈ జట్టుకు ఎంపికయ్యారు. దక్షిణాఫ్రికా పేసర్ మఫకా, విధ్వంసక ఆటగాడు ప్రిటోరియస్లతో పాటు, పాక్ పేసర్ ఉబైద్ షాలు ఈ టీమ్‌లో ఉన్నారు. వెస్టిండీస్ ఆటగాడు జెవెల్ ఆండ్రూ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. సొంతగడ్డపై జరిగిన ఈ టోర్నీలో 21 వికెట్లు పడగొట్టిన మఫకా ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు అందుకున్నాడు.
🚨 ESPNcricinfo’s Team of the 2024 Under-19 World Cup 🚨 https://t.co/mWcdNaQFj2
— ESPNcricinfo (@ESPNcricinfo) February 12, 2024
అండర్ -19 వరల్డ్ కప్ జట్టు : ఉదయ్ సహరన్, ముషీర్ ఖాన్, సచిన్ ధాస్, సౌమీ పాండే, నాథన్ ఎడ్వర్డ్. కల్లమ్ విడ్లర్, ఉబైద్ షా, క్వెనా మఫకా, జెవెల్ అండ్రూ(వికెట్ కీపర్), హగ్ విబ్జెన్(కెప్టెన్), లాన్ డ్రె ప్రిటోరియస్, హ్యారీ డిక్సన్.
ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 79 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. తొలుత 253 పరుగుల భారీ స్కోర్ చేసిన ఆసీస్.. ఆ తర్వాత టీమిండియాను 174కే కట్టడి చేసింది. పేసర్ మహ్లి బియర్డ్‌మన్ మూడు కీలక వికెట్లు తీసి భారత్‌ను దెబ్బకొట్టాడు. చివర్లో మురుగన్ అభిషేక్(42) పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. సౌమీ పాండే(2)ను టామ్ స్ట్రాకర్ ఔట్ చేయడంతో ఆసీస్ నాలుగోసారి అండర్ -19 ప్రపంచకప్ చాంపియన్‌గా అవతరించింది. ఇంతకుముందు కంగారూ జట్టు 1988, 2002, 2010లో విశ్వవిజేతగా నిలిచింది.
ఇవి కూడా చదవండి
- Constable Praveen | కూంబింగ్ చేస్తుండగా విద్యుదాఘాతంతో కానిస్టేబుల్ మృతి
- KTR | చలో నల్లగొండ ఎఫెక్ట్.. బీఆర్ఎస్ ఒత్తిడితో అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్: కేటీఆర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

