హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రేస్ సిరీస్ అయిన ఎఫ్ఐఎం ఈ ఎక్స్‌ప్లోరర్ వరల్డ్‌కప్..ఏబీబీ ఫార్ములా-ఈ రేస్ వరల్డ్ చాంపియన్‌షిప్‌తో జట్టు కట్టనుంది. ఏప్రిల్‌లో 13, 14తేదీల్లో మిసానోలో జరుగనున్న ఫార్ములా-ఈ రేసు సందర్భంగా ఇరు వర్గాలకు చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోనున్నాయి. భారత మోటర్ రేసింగ్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుక ఇది దోహదపడుతుందని ఇండీ రేసింగ్ టీమ్ సీఈవో అభిషేక్‌రెడ్డి పేర్కొన్నారు. నాలెడ్జ్ షేరింగ్‌పై జరిగే చర్చలోతాము పాల్గొంటుందన్నారు.