లాహోర్: పాకిస్థాన్ మాజీ సారథి బాబర్ ఆజమ్ అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు (4,234 రన్స్) సాధించిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు రోహిత్ శర్మ (4,231) పేరిట ఉండేది.
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో అతడు 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్‌ను అధిగమించాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (4,188) మూడో స్థానంలో ఉన్నాడు.