న్యూఢిల్లీ : ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కొంతకాలం ఐపీఎల్‌కు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవడం ఉత్తమమని మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్ సూచించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌నకు ముందు రోహిత్‌కు విశ్రాంతి అవసరమన్నాడు.
రోహిత్ ఐపీఎల్లో చివరి మూడు, నాలుగు మ్యాచ్‌లు ఆడితే సరిపోతుందని, డబ్ల్యుటీసీ ఫైనల్‌కు అతడు తాజాగా ఉండడం అవసరమన్నాడు. ఐపీఎల్ ఫైనల్ మే 28 తేదీన జరుగనున్నది. ప్రస్తుతం ముంబై ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.