న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ చైర్మెన్ లలిత్ మోదీ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. ఆయనకు కరోనా సోకింది. న్యూమోనియా కూడా అటాక్ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఆక్సిజన్ సపోర్ట్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని లలిత్ మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. వారంలో రెండుసార్లు తనకు కోవిడ్ ఇన్ఫెక్షన్ అయ్యినట్లు తెలిపారు. న్యూమోనియా కూడా త్రీవంగా ఉన్న కారణంగా హాస్పిటల్లో చేరినట్లు వెల్లడించారు.