న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ తల్లి కాబోతున్నది. ఈ విషయాన్ని తన భర్త సోమ్‌వీర్ రాఠితో కలిసి గురువారం సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది. 2018లో సోమ్‌వీర్‌ను పెండ్లి చేసుకున్న వినేశ్ తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్ చేసుకుంది.
పారిస్(2024) ఒలింపిక్స్‌లో అనూహ్య రీతిలో కెరీర్‌కు వీడ్కోలు పలికిన వినేశ్ ‘కొత్త చాప్టర్‌తో మా ప్రేమాయణం కొనసాగుతోంది’ అని రాసుకొచ్చింది. రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికిన వినేశ్..కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.