కోల్‌కతా: శ్రీలంక ఆల్‌రౌండర్ కమిందు మెండిస్( Kamindu Mendis).. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడుతున్నాడు. అయితే గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ ఆల్‌రౌండర్ ఓ ఓవర్ వేశాడు. ఆ ఒక్క ఓవర్లోనే అతను రెండు చేతులతో బౌలింగ్ చేశాడు. తొలి మూడు బంతులు కుడి చేయితో వేయగా, తర్వాత మూడు బంతుల్ని ఎడమ చేతితో వేశాడు. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మెండిస్ ఆ స్టంట్ క్రియేట్ చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఓ బౌలర్ రెండు చేతులతో ఒకే ఓవర్లో బౌలింగ్ చేయడం ఇదే మొదటిసారి.
ఇన్నింగ్స్ 13వ ఓవర్లో మెండిస్ ఆ విధంగా బౌలింగ్ చేశాడు. ఆ ఒక్క ఓవర్లో నాలుగు రన్స్ ఇచ్చి.. కీలకమైన కోల్‌కతా బ్యాటర్ రఘువంశీ వికెట్‌ను తీశాడు. 2016లో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్‌లో తొలి సారి మెండిస్ రెండు చేతులతోనూ బౌలింగ్ చేశాడు. ఇక అంతర్జాతీయ స్థాయిలో అతను గత ఏడాది భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ , రిషబ్‌లకు అతను రెండు చేతులతో బౌలింగ్ చేశాడు.
మెండిస్ బౌలింగ్‌లో.. అతను వేసే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్.. ఆఫ్ స్పిన్‌తో పోలిస్తే కొంత బెటర్‌గా ఉంటుంది. క్రికెట్లో బౌలర్ ఎవరైనా చేతులు మార్చి బౌలింగ్ చేయడం చట్టబద్దమే. కానీ బౌలర్ అలా చేయి మార్చిన ప్రతిసారి అంపైర్‌కు చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ రైట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజ్‌లో ఉంటే అప్పుడు మెండిస్ తన ఎడమ చేతితో స్పిన్ బౌలింగ్ చేస్తాడు. ఇక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ బ్యాటింగ్ చేస్తుంటే అతను తన కుడి చేతితో స్పిన్ బౌలింగ్ చేస్తాడు. గతంలో శ్రీలంక క్రికెటర్ హసన్ తిలకరత్నే కూడా రెండు చేతులతో బౌలింగ్ చేసేవాడు.
Kamindu Mendis bowling with both hands in an over and got a wicket too.#KKRvsSRH | #SRHvsKKR | #SRHvKKRpic.twitter.com/NQOcXdiF9T
— Don Cricket 🏏 (@doncricket_) April 3, 2025