అస్తానా: కజకిస్థాన్ ఇంటర్నేషనల్ చాలెంజ్‌లో భారత యువ షట్లర్లు అదరగొట్టారు. మహిళల సింగిల్స్‌లో ఐదుగురు ప్లేయర్లు క్వార్టర్స్‌కు అర్హత సాధించారు. నేషనల్ చాంపియన్ అన్మోల్ ఖర్బ్తో పాటు దేవికా సింగ్, అనుపమ ఉపాధ్యాయ, తన్య హేమంత్, ఇష్రాని బరుహ ప్రి క్వార్టర్స్‌లో ప్రత్యర్థులను చిత్తుచేశారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో 17 ఏండ్ల అన్మోల్ 21-11, 21-7 తేడాతో నురానీ (యూఏఈ) ని చిత్తుచేసింది. క్వార్టర్స్‌లో ఆమె.. జపాన్ క్రీడాకారిణి సొరనొ యోషికవతో తలపడనుంది. దేవికా.. నాలుగో సీడ్ ఫాతిమాను ఓడించింది.