ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఆదిశగా అడుగులు వేస్తోంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న కోహ్లీసేన ప్రతీ మ్యాచ్‌లోనూ
సమిష్టిగా రాణిస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్వెల్, ఏబీ డివిలియర్స్
పరుగుల వరదపారిస్తున్నారు. ప్రత్యర్థి మారినా అదే జోరులో వరుస విజయాలతో దూసుకెళ్తోంది.
ఆదివారం కోల్‌కతా నైట్రైర్స్తో జరిగిన మ్యాచ్‌లో 38 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు ఒక సీజన్లో మొదటి మూడు మ్యాచ్‌లు గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీనికన్నా ముందు ఐపీఎల్ 2014 సీజన్లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించారు. గత సీజన్లలో జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లున్నా ఆ వారికి శుభారంభాలు దక్కలేదు. మరోవైపు, కోల్‌కతాతో జరిగిన చివరి మూడు మ్యాచ్‌ల్లోనే కోహ్లీసేన ఘన విజయం సాధించడం విశేషం.
When words don't do justice, all we can do is stand up, applaud and bow down at his genius 👏🙌#PlayBold #WeAreChallengers #IPL2021 pic.twitter.com/Lrg6j8T4bD
— Royal Challengers Bangalore (@RCBTweets) April 19, 2021