e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021

భువిజయం..

  • విజృంభించిన భువనేశ్వర్‌
  • తొలి టీ20 భారత్‌ గెలుపు

బ్యాటింగ్‌లో కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ ఇన్నింగ్స్‌కు.. బౌలింగ్‌లో వైస్‌ కెప్టెన్‌ భువనేశ్వర్‌ కుమార్‌ విజృంభణ తోడవడంతో పొట్టి ఫార్మాట్‌లో భారత్‌ బోణీ కొట్టింది. గబ్బర్‌కు సూర్యకుమార్‌ మెరుపులు తోడైతే.. భువీకి దీపక్‌ చాహర్‌ సహకారమందించాడు. ఫలితంగా తొలి విజయంతో ముందడుగేసిన భారత్‌.. పొట్టి ప్రపంచకప్‌నకు ముందు ఆడుతున్న చివరి సిరీస్‌లో మెరుగైన స్థితికి చేరింది.

కొలంబో: వన్డే సిరీస్‌ చేజిక్కించుకున్న టీమ్‌ఇండియా.. పొట్టి ఫార్మాట్‌లోనూ బోణీ కొట్టింది. బ్యాట్స్‌మెన్‌ భారీ స్కోరు చేయకపోయినా.. బౌలర్లు బాధ్యతాయుత ప్రదర్శన కనబర్చడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ధావన్‌ సేన 1-0తో ముందంజలో నిలిచింది. ఆదివారం ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరిగిన తొలి టీ20లో భారత్‌ 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (34 బంతు ల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (46) రాణించారు. ఓ మాదిరి లక్ష్యఛేదనలో లంక చెమటోడ్చింది. చరిత అసలంక (44) మినహా తక్కినవాళ్లు విఫలమవడంతో లంక 18.3 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ 4, దీపక్‌ చాహర్‌ రెండు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య మంగళవారం ఇక్కడే రెండో టీ20 జరుగనుంది.

- Advertisement -

పృథ్వీ గోల్డెన్‌ డక్‌
వన్డే సిరీస్‌లో వరుస బౌండ్రీలతో లంకేయులను బెదరగొట్టిన యువ ఓపెనర్‌ పృథ్వీ షా.. అరంగేట్ర టీ20లో ఆకట్టుకోలేకపోయాడు. చమీర వేసిన ఇన్నింగ్స్‌ తొలి బంతికి వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సంజూ శాంసన్‌ (27)తో కలిసి ధావన్‌ ఇన్నింగ్స్‌ను ముందు కు నడిపించడంతో పవర్‌ ప్లే ముగిసే సరికి భారత్‌ 51/1తో నిలిచింది. ఆ తర్వాత సంజూ ఔట్‌ కాగా.. సూర్యకుమార్‌ సాధికారికంగా ఆడాడు. ధావన్‌ కూడా జోరందుకోవడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. అర్ధశతకానికి ముందు ధావన్‌ ఔట్‌ కాగా.. భారీ సిక్సర్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాక సూర్యకుమార్‌ పెవిలియన్‌ చేరాడు. ఆఖర్లో హార్దిక్‌ పాండ్యా (10), ఇషాన్‌ కిషన్‌ (20 నాటౌట్‌) వేగంగా ఆడలేకపోవడంతో భారత్‌ ఓ మోస్తా రు స్కోరుకే పరిమితమైంది.

వరుసకట్టి..
ఛేదనలో శ్రీలంక ఏ దశలోనూ విజయం దిశగా పయణించలేదు. భారత బౌలర్లు ఆరంభం నుంచి ఒత్తిడి కొనసాగించగా.. చెత్త షాట్లతో లంకేయులు మూల్యం చెల్లించుకున్నారు. చరిత అసలెంకతో పాటు అవిష్క ఫెర్నాండో (26), కెప్టెన్‌ డసున్‌ షనక (16), భానుక (10) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు.

పృథ్వీ, వరుణ్‌ అరంగేట్రం
ఇప్పటికే టెస్టు, వన్డేల్లో భారత జట్టు తరఫున చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడిన పృథ్వీ షా.. ఈ మ్యాచ్‌తో టీ20 అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన వరుణ్‌ చక్రవర్తి ఎప్పటి నుంచో టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకునేందుకు తహతహలాడుతుండగా.. మొత్తానికి ఆదివారం ముహుర్తం కుదిరింది. తొలి మ్యాచ్‌లో పృథ్వీ డకౌట్‌ కాగా.. వరుణ్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

స్కోరు బోర్డు
భారత్‌: పృథ్వీషా (సి) భానుక (బి) చమీర 0, ధావన్‌ (సి) భండార (బి) చమిక 46, శాంసన్‌ (ఎల్బీ) హసరంగ 27, సూర్యకుమార్‌ (సి) (సబ్‌) మెండిస్‌ (బి) హసరంగ 50, హార్దిక్‌ (సి) భానుక (బి) చమీర 10, ఇషాన్‌ (నాటౌట్‌) 20, కృనాల్‌ (నాటౌట్‌) 3, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 20 ఓవర్లలో 164/5. వికెట్ల పతనం: 1-0, 2-51, 3-113, 4-127, 5-153, బౌలింగ్‌: చమీర 4-0-24-2, చమిక 4-0-34-1, అఖిల 3-0-40-0, ఉడాన 4-0-32-0, హసరంగ 4-0-28-2, షనక 1-0-4-0.
శ్రీలంక: అవిష్క (సి) శాంసన్‌ (బి) భువనేశ్వర్‌ 26, భానుక (సి) సూర్యకుమార్‌ (బి) కృనాల్‌ 10, ధనంజయ (బి) చాహల్‌ 9, చరిత అసలెంక (సి) పృథ్వీషా (బి) దీపక్‌ 44, అషెన్‌ (బి) హార్దిక్‌ 9, షనక (స్టంప్డ్‌) ఇషాన్‌ (బి) వరుణ్‌ 16, హసరంగ (బి) దీపక్‌ 0, చమిక (బి) భువనేశ్వర్‌ 3, ఉడాన (సి) సూర్యకుమార్‌ (బి) భువనేశ్వర్‌, చమీర (సి) కృనాల్‌ (బి) భువనేశ్వర్‌ 1, అఖిల (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 18.3 ఓవర్లలో 126 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-23, 2-48, 3-50, 4-90, 5-111, 6-111, 7-122, 8-124, 9-125, 10-126, బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3.3-0-22-4, దీపక్‌ 3-0-24-2, కృనాల్‌ 2-0-16-1, వరుణ్‌ 4-0-28-1, చాహల్‌ 4-0-19-1, హార్దిక్‌ 2-0-17-1.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana