భువనేశ్వర్: హాకీ జూనియర్ ప్రపంచకప్ టోర్నీకి బుధవారం తెరలేవనుంది. 16 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు కాంస్యం స్ఫూర్తితో కుర్రాళ్లు మైదానంలోకి అడుగుపెడుతున్నారు. 2001, 2016లో ట్రోఫీని ముద్దాడిన భారత్.. ముచ్చటగా మూడోసారి కప్ అందుకునేందుకు సంసిద్ధమైంది. పూల్-బీలో ఉన్న టీమ్ఇండియా..తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌తో తలపడనుంది. సీనియర్ జట్టులో స్థానం కోసం జూనియర్లు ఈ మెగాటోర్నీలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. కరియప్ప వద్ద శిక్షణ పొందిన జూనియర్లకు సీనియర్లు మన్‌ప్రీత్‌సింగ్, శ్రీజేశ్, భారత ప్రధాన కోచ్ గ్రహమ్ రైడ్ అండగా ఉన్నారు. 25న కెనడాతో, 27న పోలండ్‌తో భారత్ తలపడనుంది. వీటిలో విజయం సాధిస్తే క్వార్టర్స్‌లోకి ప్రవేశించనుంది.