FIFA World Cup | సెమీస్‌లో ఓడిన మొరాకో.. వీరంగం సృష్టించిన అభిమానులు
Morocco | ఆఫ్రికా జట్టు మొరాకో ఎలాంటి అంచనాలు లేకుండా ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో అడుగుపెట్టింది. హేమాహేమీలను ఓడించి సెమీఫైనల్ వరకు దూసుకొచ్చింది. అయితే బుధవారం జరిగిన
బ్రస్సెల్స్: ఆఫ్రికా జట్టు మొరాకో ఎలాంటి అంచనాలు లేకుండా ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో అడుగుపెట్టింది. హేమాహేమీలను ఓడించి సెమీఫైనల్ వరకు దూసుకొచ్చింది. అయితే బుధవారం జరిగిన సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ చేతిలో మట్టికరిచింది. దీంతో తమ జట్టు ఫైనల్‌కు చేరి కప్పు కొడుతుందనుకున్న మొరాకో అభిమానుల ఆశలు చెదిరిపోయాయి. ఫ్రాన్స్ చేతిలో ఓడిపోవడంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ అనంతరం బ్రస్సెల్స్ వీధుల్లో వీరంగం సృష్టించారు.

మొరాకో జెండాలు చేతపట్టుకన్న సుమారు వంద మంది.. బ్రసెల్స్‌లోని సౌత్ స్టేషన్ సమీపంలో చెత్త డబ్బాలు, కార్డ్బోర్డులను తగలబెట్టారు. పోలీసులపైకి పటాకులు, ఇతర వస్తువులు విసిరేశారు. దీంతో పరిస్థితి సృతిమించకుండా ఉండేందుకు పోలీసులు టియర్ గ్యాస్ వదిలారు. వాటర్ క్యానన్లతో ఆభిమానులను చెదరగొట్టారు.

బుధవారం రాత్రి జరిగిన సెమీఫైనల్లో మొరాకోపై 2-0 తేడాతో ఫ్రాన్స్ విజయం సాధించింది. ఆధ్యంతం హోరాహోరాగా సాగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జట్టులోని ఆటగాళ్ల ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో మొరాకో ఒక్కగోలు కూడా చేయకుండానే మ్యాచ్‌ను ముగించాల్సి వచ్చింది.




Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Brussels
- fans
- FIFA World Cup
- France
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

