FIFA World Cup : ఫుట్‌బాల్ అభిమానులను అలరిస్తున్న ఫిఫా వరల్డ్‌కప్ 2026లో రికార్డులు బద్ధలవుతున్నాయి. కెనడా, అమెరికా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో గోల్స్ వర్షం కురుస్తోంది. లీగ్ దశలోనే చూస్తుండగానే 100 గోల్స్ నమోదయ్యాయి. సాకర్ పండుగ చరిత్రలో 68 ఏళ్ల రికార్డును తడిపేస్తూ… కేవలం 33 మ్యాచుల్లోనే వంద రికార్డులు కొట్టేశారు ఆటగాళ్లు.
ఫిఫా వరల్డ్‌కప్ 2026లో ఆటగాళ్లు పోటాపోటీగా గోల్స్ కొడుతున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా అత్యంత వేగంగా 33 మ్యాచుల్లోనే వంద సార్లు బంతి గోల్ పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. మెక్సికో ఆటగాడు జులియన్ క్వినోన్స్ జూన్ 12న దక్షిణాఫ్రికాపై ఈ సీజన్లో మొదటి గోల్ సాధించాడు.
ఆపై అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ అల్జీరియాపై హ్యాట్రిక్ గోల్స్‌తో అదరహో అనిపించాడు. నెదర్లాండ్స్ స్టార్ కాడీ గక్పో స్వీడన్‌పై చేసిన మూడో గోల్ ఈ ఎడిషన్‌లో వందో గోల్. 1982లో 20214లోనూ 36 మ్యాచుల్లో వంద గోల్స్ సాధ్యమయ్యాయి. ఇక 1978, 1994లో సెంచరీ గోల్‌కు 38 మ్యాచ్‌లు పట్టింది. ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆల్‌టైమ్ రికార్డు 1954 ఎడిషన్‌కు చెందుతుంది. స్విట్జర్లాండ్ ఆతిథ్యమిచ్చిన ఆ టోర్నీలో జర్మనీ విజేతగా నిలవగా.. 20 మ్యాచుల్లోనే వంద గోల్స్ నమోదయ్యాయి.
3 goals, 3 points, 1 Messi. #FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) June 17, 2026