పూణె : భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఫిడే ఉమెన్స్ గ్రాండ్ ప్రిక్స్‌లో చాంపియన్‌గా నిలిచింది. బుధవారం జరిగిన చివరిదైన 9వ రౌండ్లో హంపి.. నుర్గుయిల్ సలిమోవా (బల్గేరియా)ను ఓడించి ఏడు పాయింట్లతో స్వర్ణం గెలిచింది. ఆఖరి రౌండ్లో తెల్ల పావులతో బరిలోకి దిగిన హంపి.. ప్రత్యర్థి ఎలాంటి సంచలనాలకూ తావివ్వకుండా గేమ్‌ను ముగించింది. ఇక తొమ్మిదో రౌండ్లో చైనా అమ్మాయి జినర్ కూడా గెలిచి.. హంపితో సమానంగా ఏడు పాయింట్లు సాధించినప్పటికీ టైబ్రేక్ రికార్డుతో భారత గ్రాండ్‌మాస్టర్ చాంపియన్‌గా నిలిచింది. భారత్‌కే చెందిన దివ్య దేశ్‌ముఖ్ మూడోస్థానంలో నిలవగా ద్రోణవల్లి హారిక నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.