Shadab Khan | ‘సిక్సర్లు ఎందుకు ఇస్తున్నవ్’.. పాక్ ఆల్‌రౌండర్‌ను తిట్టిపోసిన మహిళ
Shadab Khan : పొట్టి ప్రపంచ కప్ ముందు పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ (Shadab Khan)కు వింత అనుభవం ఎదురైంది. ఇంగ్లండ్ (England)తో జరుగుతున్న పొట్టి సిరీస్‌లో ధారాళంగా పరుగులు ఇస్తున్న అతడిపై ఓ మహిళా అభిమాని కోప్పడింది.
Shadab Khan : పొట్టి ప్రపంచ కప్ ముందు పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్(Shadab Khan)కు వింత అనుభవం ఎదురైంది. ఇంగ్లండ్(England)తో జరుగుతున్న పొట్టి సిరీస్‌లో ధారాళంగా పరుగులు ఇస్తున్న అతడిపై ఓ మహిళా అభిమాని కోప్పడింది. మొదట ఫొటో తీసుకున్న ఆమె ఆ తర్వాత షాదాబ్ వంక చూస్తూ.. ‘అంతలా సిక్సర్లు ఎందుకు ఇస్తున్నవ్. ఫామ్‌లోకి రా’ అని తిట్టిపోసింది.
సదరు అభిమాని మాటలకు పాక్ ఆటగాడికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మిన్నకుండిపోయాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పాక్ నాలుగు టీ20ల సిరీస్ ఆడుతోంది.
రెండేండ్ల క్రితం ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన వరల్డ్ కప్‌లో షాదాబ్ అద్భుతంగా రాణించాడు. పాక్ జట్టు తరఫున మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మాజీ సారథి షాహీద్ ఆఫ్రిది రికార్డు బద్ధలు కొట్టాడు. ఆ తర్వాత ఏమైందోగానీ షాదాబ్ ఫామ్ కోల్పోయాడు. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్‌లో దారుణంగా విఫలమయ్యాడు.
A Pakistani Fan scolded Shadab Khan and said – “Aap Chakke Kyu Kha rahe hai” 😭🤣 pic.twitter.com/Bz1one1QUR
— Professor Sahab (@ProfesorSahab) May 30, 2024
5 టీ20ల్లో..
గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20లో ఈ ఆల్‌రౌండర్ ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ఐర్లాండ్‌పై 54 రన్స్ సమర్పించుకున్న అతడు.. ఇంగ్లండ్‌పై రెండో టీ20లో వికెట్ తీయకుండానే 55 పరుగులు ఇచ్చాడు. అంతేకాదు బ్యాటింగ్‌లోనూ షాదాబ్ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. 5 టీ20ల్లో వరుసగా వరుసగా 3, 0. 15 నాటౌట్, 41 పరుగులు చేశాడంతే.
ఇవి కూడా చదవండి
- PM Modi | కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ.. భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు
- Hindu-Muslim marriage | ముస్లిం చట్టం ప్రకారం.. హిందూ, ముస్లింల వివాహం చెల్లదు: హైకోర్టు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

