PM Modi | కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ.. భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు
PM Modi | చివరిదశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారి చేరుకున్నారు. అనంతరం ప్రధాని భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు చేశారు. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ధోతీని ధరించి, తెల్లని శాలువను కప్పుకున్న ప్రధాని ఆలయానికి చేరుకున్నారు.
PM Modi | చివరిదశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారి చేరుకున్నారు. అనంతరం ప్రధాని భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు చేశారు. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ధోతీని ధరించి, తెల్లని శాలువను కప్పుకున్న ప్రధాని ఆలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత వివేకానంద మెమోరియల్లోని ధాన్య్ మండపం వద్ద ధ్యానం చేయనున్నారు. స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశంలోనే ప్రధాని మోదీ పగలు, రాత్రి ధ్యానం చేయనున్నారు. అనేక దశాబ్దాల క్రితం. ఈ ప్రదేశంలో పార్వతీదేవి ఒంటికాలిపై నిలబడి తపస్సు చేసిందని ప్రతీతి.
ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారం అనంతరం ప్రధాని ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. ఐదేళ్ల కిందట 2019లో ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే కేదార్నాథ్ సందర్శించారు. 2014లో ఆయన మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు సంబంధించిన ప్రతాప్‌గఢ్‌కు వెళ్లారు. ప్రధాని ఈసారి కన్యాకుమారిని ఎంచుకున్నారు. ఈ నిర్ణయం వెనుక సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. దశాబ్దాల కిందట స్వామి వివేకానంద భారతమాత దర్శనం పొందిన ప్రదేశం కన్యాకుమారి. ఈ ప్రాంతం స్వామి వివేకానంద జీవితంపై ఎంతో ప్రభావం చూపింది. గౌతమ బుద్ధుని జీవితంలో సారనాథ్ ఎంత ముఖ్యమైనదో.. స్వామి వివేకానంద జీవితంలో రాక్ మెమోరియల్ సైతం ప్రత్యేకమైంది.
దేశమంతా తిరుగుతూ కన్యాకుమారి చేరుకున్న స్వామి వివేకానంద ఇక్కడ మూడు రోజుల ధ్యానం చేశారు. ఇక్కడ శిలపైనే ఆయనకు జ్ఞానోదయం జరిగిందని ప్రతీతి. ఈ ప్రదేశంలో పార్వతీ దేవి శివుడి కోసం ఎదురుచూస్తూ ఒంటికాలిపై నిలబడి తపస్సు చేసిందని చెబుతారు. భౌగోళికంగా ఈ ప్రాంతం దక్షిణాన చివరిది. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రం కలిసే ప్రదేశం కూడా. ఇదిలా ఉండగా.. 543 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఏడు దశల్లో జరిగే ఎన్నికలకు చివరిగా జూన్ ఒకటిన పోలింగ్ జరుగనున్నది. ఓట్లను జూన్ 4న లెక్కించనున్నారు.
#WATCH | Prime Minister Narendra Modi arrives at Vivekananda Rock Memorial in Kanyakumari, Tamil Nadu
He will meditate from 30th May evening to 1st June evening.
PM Modi will meditate day and night at the same place where Swami Vivekanand did meditation, at the Dhyan… pic.twitter.com/7QfKkvRLLN
— ANI (@ANI) May 30, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

