వేల కోట్లు సంపాదిస్తున్నారు.. మ్యాచ్ నిర్వహణ ఇలాగేనా..? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి పేరుంది. ఇటీవలే ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా రూ. 48,390 కోట్లు వెనకేసుకున్న బీసీసీఐ.. స్వదేశంలో మ్యాచులు నిర్వహిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన ఐదో టీ20 వర్షార్పణమైన నేపథ్యంలో అభిమానులు బీసీసీఐపై విమర్శలు గుప్పిస్తున్నారు.
భారత్ లో ఈడెన్ గార్డెన్, వాంఖెడే తర్వాత అంతటి ఖ్యాతిని పొందిన చిన్నస్వామి స్టేడియం నిర్వహణపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. నిన్నటి మ్యాచ్ లో వర్షం పడుతుండగా.. స్టాండ్స్ లో కూర్చున్న అభిమానులు రూఫ్ నుంచి వర్షం నీరు కారడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం సుమారు రెండు గంటల పాటు వర్షం కురవగా.. స్టాండ్స్ లో పలు చోట్ల రూఫ్ నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి.
దీంతో మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ అభిమాని ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్ వేదికగా షేర్ చేస్తూ.. ‘వర్షం వల్ల మ్యాచ్ పోతే పోయింది. కానీ అంతకంటే తీవ్ర నిరాశకు గురిచేసే అంశమిదే (వీడియోను షేర్ చేస్తూ..). ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డు.. స్టేడియాల నిర్వహణను ఇలాగేనా చేసేది..? బీసీసీఐ ఇంకెప్పుడు అభిమానులు హాయిగా మ్యాచ్ చూసేలా స్టేడియాలలో వసతులు సమకూరుస్తుంది..?’ అని ప్రశ్నించాడు.
ఇదిలాఉండగా.. ఆదివారం నాటి మ్యాచ్ లో వర్షం వల్ల 45 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైన ఆట 3 ఓవర్లు పడగానే మళ్లీ నిలిచిపోయింది. ఆ తర్వాత వర్షం తేరుకోకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేశారు. దీంతో సిరీస్ ను భారత్-దక్షిణాఫ్రికా 2-2తో పంచుకున్నాయి.
What was even more disappointing was the state of affairs inside the stadium! The richest board in the world and these are the kind of conditions their fans need to put up with! When will @BCCI @kscaofficial1 improve fan experience befitting the stature of the sport?? pic.twitter.com/eacucPnwUp
— Srinivas Ramamohan (@srini_ramamohan) June 19, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

