అబుదాబి: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ తీవ్రంగా గాయపడ్డాడు. క్వెటా గ్లాడియేటర్స్ తరఫున ఆడుతున్న డుప్లెసిస్ బౌండరీ లైన్ వద్ద డైవ్ చేసిన సయయంలో జట్టు సభ్యుడు మహమ్మద్ హస్నైన్ ఢీకొన్నాడు. పెషావర్ జల్మీ బ్యాటింగ్ 19వ ఓవర్లో బంతి బౌండరీకు వెళుతుండగా అడ్డుకునేందుకు డుప్లెసిస్ డైవ్ చేశాడు. అప్పుడు వేగంగా పరుగెత్తుకొచ్చిన మహమ్మద్ మోకాలు ఫాఫ్ తలను బలంగా ఢీకొంది. దీంతో డుప్లెసిస్ మైదానంలోనే పడిపోయాడు. అనంతరం స్కానింగ్ కోసం డుప్లెసిస్‌ను దవాఖానకు తరలించారు. కాగా ఈ ఘటన తనను కలచి వేస్తున్నదని డుప్లెసిస్ భార్య ఇమారి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.