ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ముస్తాఫిజుర్ వేసిన నాలుగో ఓవర్లో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఔటయ్యాడు. గత రెండు మ్యాచ్‌ల్లో 5(8), 5(16) పరుగులే చేసిన గైక్వాడ్ ఈ మ్యాచ్‌లోనూ 10(13) రన్స్‌కే పెవిలియన్ చేరాడు. గత సీజన్లో అద్భుతంగా రాణించిన గైక్వాడ్ ఈ ఏడాది ఆరంభం నుంచి తడబడుతున్నాడు.
ఉనద్కత్ వేసిన ఐదో ఓవర్లో డుప్లెసిస్ దంచికొట్టాడు. సూపర్ స్ట్రైకింగ్‌తో 4 4 6 4 బాది 19 పరుగులు రాబట్టాడు. క్రిస్ మోరీస్ వేసిన తర్వాతి ఓవర్ నాలుగో బంతిని భారీ షాట్ ఆడేందుకు యత్నించిన డుప్లెసిస్.. బౌండరీ లైన్ వద్ద రియాన్ పరాగ్ చేతికి చిక్కాడు. పవర్‌ప్లే ముగిసేసరికి చెన్నై రెండు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. మొయిన్ అలీ(3), సురేశ్ రైనా(0) క్రీజులో ఉన్నారు.
#CSK lose two wickets in the powerplay with 46 runs on the board.
— IndianPremierLeague (@IPL) April 19, 2021
Live – https://t.co/vRHaGGSTjJ #CSKvRR #VIVOIPL pic.twitter.com/v25MYMTPv2