హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతున్న యువ షూటర్ ఇషాసింగ్‌ను ఆమె చదువుతున్న రిక్వెల్ఫోర్డ్ స్కూల్ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. పాఠశాల 11వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం ఇషాను శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు.
తమ విద్యార్థి అయిన ఇషా..ఇటీవల ముగిసిన షూటింగ్ ప్రపంచకప్‌లో నాలుగు పతకాలు సాధించడం గర్వకారణంగా ఉందని స్కూల్ ఫౌండర్ చైర్మన్ ఉదయ్‌కుమార్ అన్నారు. మరోవైపు కేంబ్రిడ్జ్ ఔట్‌స్టాండింగ్ లెర్నర్ అవార్డు సాధించిన అన్షును కూడా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఆర్ఈఎస్ఐ డైరెక్టర్ అజయ్ మిశ్రా, విద్యాశాఖ మాజీ ప్రధాన కార్యదర్శి చెల్లప్ప తదితరులు హాజరయ్యారు.