Paris 2024 Olympic selection trials | ఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ సెలక్షన్స్ ట్రయల్స్‌లో భాగంగా ఢిల్లీలోని కర్ణిసింగ్ షూటింగ్ రేంజ్లో జరుగుతున్న మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ అర్హత పోటీల తొలిరోజు హైదరాబాదీ షూటర్ ఇషాసింగ్ అగ్రస్థానంలో నిలిచింది. టీ1 క్వాలిఫికేషన్లో భాగంగా ఇషా 585 పాయింట్లు స్కోరు చేసి తొలి స్థానం దక్కించుకుంది.
583 పాయింట్లతో సిమ్రన్ప్రీత్ కౌర్, భారత అగ్రశ్రేణి షూటర్ మనూ బాకర్ (582) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ ట్రయల్స్‌లో పాల్గొంటున్న పది మంది షూటర్లు శనివారం మరోసారి బరిలోకి దిగనున్నారు. ఆ ర్యాంకుల ఆధారంగా ఒలింపిక్స్ బెర్తులు ఖాయమవుతాయి.