Eoin Morgan | అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ సారధి మోర్గాన్
ఇయాన్ మోర్గాన్.. ఈ పేరు వింటే ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ కళ్లు పెద్దవి చేసేది. అతని ఆటతీరు చూసి ఆశ్చర్యపోయేది. సింగిల్స్, డబుల్స్ కన్నా పరుగుల కోసం ఎక్కువగా బౌండరీలపై ఆధారపడే ఈ ఎడంచేతి వాటం ఇంగ్లిష్ బ్యాటర్.. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగాడు. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ జట్టు కెప్టెన్సీ అందుకున్నాడు.
తన నాయకత్వ ప్రతిభ కనబరుస్తూ వచ్చిన అతను.. తన జట్టుకు 2019లో వన్డే ప్రపంచకప్ కూడా అందించాడు. ఏడేళ్లపాటు ఇంగ్లండ్ వన్డే కెప్టెన్‌గా ఉన్న అతను.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో జట్టును నెంబర్ వన్‌గా నిలిపిన ఘనత కూడా దక్కించుకున్నాడు.
అంతేకాదు, గతేడాది ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ముందుండి నడిపించాడు. దినేష్ కార్తీక్ నుంచి లీగ్ మధ్యలో జట్టు పగ్గాలు అందుకున్న అతను.. యూఏఈలో జరిగిన రెండో ఫేజ్ ఐపీఎల్లో జట్టును గాడిలో పెట్టి ఫైనల్స్ చేర్చాడు.

ఇంగ్లండ్ తరఫున అత్యధిక వన్డేలు, టీ20లు ఆడిన ఆటగాడిగానే కాదు.. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు. 35 ఏళ్ల మోర్గాన్ కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు.
ఇటీవలే ఇంగ్లండ్ టెస్టు జట్టు సారధ్యానికి స్టార్ ఆటగాడు జో రూట్ వీడ్కోలు పలకడంతో.. వన్డేల్లో కూడా మోర్గాన్ తన కెప్టెన్సీ వదిలేస్తాడంటూ ప్రచారం జరిగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్‌కే మోర్గాన్ గుడ్‌బై చెప్పేశాడు. ఈ షాకింగ్ న్యూస్ చాలా మంది క్రీడాభిమానులకు మింగుడు పడటం లేదు.
You’ve changed English cricket forever.
An innovator 🏏 A motivator 💪 A champion 🏆
Your legacy will live on…#ThankYouMorgs ❤️ pic.twitter.com/a32SSvCDXI
— England Cricket (@englandcricket) June 28, 2022
"I'm hugely proud of what I have achieved, but what I will cherish and remember most are the memories I made with some of the greatest people I know."#ThankYouMorgs 👏
— England Cricket (@englandcricket) June 28, 2022
Record-breaker 📊
History maker 📝
Our greatest ever 🏏#ThankYouMorgs ❤️ pic.twitter.com/jvvWprBSDK— England Cricket (@englandcricket) June 28, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

