WPL 2024 | డబ్ల్యూపీఎల్ ఆడాలా?.. దేశం తరఫున ఆడాలా?.. అయోమయంలో ఇంగ్లండ్ క్రికెటర్లు
WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్(WPL) రెండో సీజన్ తేదీలు రావడంతో అన్ని ఫ్రాంచైజీలు లీగ్‌కు సన్నద్ధతపై దృష్టి పెట్టాయి. పలువురు విదేశీ క్రికెటర్లు జట్టుతో కలిసేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ల(England Cricketers)కు మాత్రం ఇప్పుడు పెద్ద సందిగ్ధం...
WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్(WPL) రెండో సీజన్ తేదీలు రావడంతో అన్ని ఫ్రాంచైజీలు లీగ్‌కు సన్నద్ధతపై దృష్టి పెట్టాయి. పలువురు విదేశీ క్రికెటర్లు జట్టుతో కలిసేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ల(England Cricketers)కు మాత్రం ఇప్పుడు పెద్ద సందిగ్ధం వచ్చి పడింది. ఏంటంటే..? డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 17 వరకు జరుగనుంది. 22 మ్యాచ్‌ల ఈ టోర్నీ ముగిసిన రెండు రోజులకే న్యూజిలాండ్(Newzealand)తో టీ20 సిరీస్ ఉంది. ఆ తర్వాత అక్టోబర్‌లో మహిళల టీ20 వరల్డ్ కప్ జరుగనుంది.
ఒకవేళ డబ్ల్యూపీఎల్‌లో ఆడితే నేరుగా కివీస్‌తో పొట్టి సిరీస్లోఆడాల్సి వస్తుంది. అందుకని దేశానికి ఆడాలా? డబ్ల్యూపీఎల్ నుంచి తప్పుకోవాలా? అని ఇంగ్లండ్ క్రికెటర్లు అయోమంలో పడ్డారు. అయితే.. దేశానికే తొలి ప్రాధాన్యం ఇచ్చేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. ఇంగ్లండ్ ప్లేయర్ లారెన్ బెల్(Lauren Bell) ఇప్పటికే టోర్నీ నుంచి వైదొలిగొంది. రెండో సీజన్లో యూపీ వారియర్స్(UP Warriorz) ఫ్రాంచైజీ తరఫున ఆడాల్సిన ఆమె న్యూజిలాండ్ సిరీస్ కోసం జట్టును వీడింది. ఆమె స్థానంలో శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు(Chamari Athapaththu) జట్టుతో కలువనుంది.
ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లలో పలువురు డబ్ల్యూపీఎల్‌లో ఆడుతున్నారు. అలిసే క్యాప్సే, ఇసీ వాంగ్, నాట్ స్కీవర్ బ్రంట్, హీథర్ నైట్, సోఫీ ఎకిల్‌స్టోన్, డానీ వ్యాట్లు రెండో సీజన్లోనూ సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నారు. నిరుడు జరిగిన తొలి సీజన్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) విజయాల్లో నాట్ స్కీవర్ బ్రంట్, ఇసీ వాంగ్ కీలక పాత్ర పోషించారు. దాంతో, ముంబై ఈ ఇద్దరినీ రీటైన్ చేసుకుంది.
ఇవి కూడా చదవండి
- Radikaa Sarathkumar | ఇదేం చెత్త సినిమా అంటూ రాధిక ఆగ్రహం.. ఇంతకీ ఏ సినిమా అంటే.?
- Mohammad Shami | రూబిక్ క్యూబ్స్‌తో షమీ బొమ్మ.. వీడియో వైరల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

