Mohammad Shami | రూబిక్ క్యూబ్స్‌తో షమీ బొమ్మ.. వీడియో వైరల్
Mohammad Shami : సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)లో భారత పేసర్ మహ్మద్ షమీ(Mohammad Shami) ఏ రేంజ్లో చెలరేగాడో చూశాం. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఈ స్టార్ బౌలర్ దూరమైనప్పటికీ అతడి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఒక యువ అభిమాని రూబిక్ క్యూబ్స్...
Mohammad Shami : సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)లో భారత పేసర్ మహ్మద్ షమీ(Mohammad Shami) ఏ రేంజ్లో చెలరేగాడో చూశాం. బుల్లెట్ లాంటి బంతులతో టీమిండియా గెలుపు గుర్రంగా మారిన ఈ స్పీడ్‌స్టర్ టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఈ స్టార్ బౌలర్ దూరమైనప్పటికీ అతడి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
అందులో ఒక యువ అభిమాని రూబిక్ క్యూబ్స్(Rubiks Cube)తో షమీ బొమ్మ వేశాడు. అది కూడా కళ్లకు గంతలు కట్టుకొని రూబిక్ క్యూబ్స్‌ను చకచకా సెట్ చేసి స్పీడ్‌స్టర్ బొమ్మ వేశాడు. దాంతో, షమీతో పాటు అక్కడ ఉన్నవాళ్లంతా ఆ కుర్రాడి ప్రతిభకు ఫిదా అయ్యారు.
భారత పేసర్ అయితే మస్త్ ఖుషీ అవ్వడమే కాదు ఆ యంగ్‌స్టర్‌కు అభినందించి ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు. ‘మాస్టర్అఫన్కుట్టీ'(masteraffankutty) అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో ఉన్న వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోకు 26 లక్షల లైక్స్ వచ్చాయి.

నిరుడు ఆసియా కప్, ప్రపంచకప్‌లో షమీ టీమిండియాకు వెన్నెముకలా నిలిచాడు. పవర్ ప్లేలో వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. దాంతో, ప్రతిష్ఠాత్మక అర్జున(Arjuna) అవార్డు కూడా అందుకున్నాడు. వరల్డ్ కప్ తర్వాత కాలిమడమ గాయం కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో కోలుకుటున్న షమీ మెరుగైన చికిత్స కోసం త్వరలోనే లండన్ వెళ్లనున్నాడని సమాచారం.
ఇవి కూడా చదవండి
- Hemant Soren | విచారణకు సమయం ఇవ్వండి..! లేకపోతే మేమే వస్తాం..! జార్ఖండ్ సీఎం సోరెన్‌కు ఈడీ సమన్లు..!
- Tirumala | వరుస సెలవుల కారణంగా తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- IND vs ENG 1st Test: పోప్ మీదే ఆశలన్నీ.. టీ విరామానికి ముందే ఇంగ్లండ్‌కు భారీ షాక్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

