టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ ఇంగ్లండ్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై ఇంగ్లండ్ భారీ విజయం సాధించింది. 26 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలిచింది. 19 ఓవర్లలో శ్రీలంక ఆల్ అవుట్ అయింది. కేవలం 137 పరుగులే సాధించి.. ఇంగ్లంగ్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.
అంతకుముందు టాస్ గెలిచిన శ్రీలంక.. ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ బరిలోకి ఇంగ్లండ్ దిగింది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. ఇంగ్లండ్‌పై గెలవడానికి చివరి వరకు ప్రయత్నించింది. కానీ.. వికెట్లను నిలుపుకోలేకపోవడంతో 19 ఓవర్లకే ఆల్ అవుట్ అయింది.
శ్రీలంక ప్లేయర్లలో హసరంగ 21 బంతుల్లో 34 పరుగులు చేశాడు. కెప్టెన్ శనక 25 బంతుల్లో 26 పరుగులు, రాజపక్స 18 బంతుల్లో 26 పరుగులు, అసలంక 16 బంతుల్లో 21 పరుగులు, ఫెర్నాండో 14 బంతుల్లో 13 పరుగులు చేశారు.
ఇంగ్లండ్ బౌలర్లలో మోయిన్ అలీ 3 ఓవర్లు వేసి 15 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. క్రిస్ వోక్స్ 2.3 ఓవర్లలో ఒక వికెట్ తీసి 25 పరుగులు ఇచ్చాడు. రషీద్ 4 ఓవర్లు వేసి రెండు వికెట్లు, జోర్డాన్ 4 ఓవర్లు వేసి 2 వికెట్లు, లివింగ్‌స్టోన్ 4 ఓవర్లు వేసి ఒక్క వికెట్ తీశారు.
ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ ఆటగాడు జాస్ బట్లర్ ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021లో తొలి సెంచరీని నమోదు చేశాడు. 67 బంతుల్లో 101 పరుగులు చేసి 6 ఫోర్లు, 6 సిక్సులు బాదాడు. దీంతో బట్లర్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.
గ్రూప్ 1లో ఫస్ట్ నుంచి ఇంగ్లండ్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతూ వస్తోంది. ఇంగ్లండ్ ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచులలో గెలిచింది. దీంతో 8 పాయింట్లను సాధించి 3.183 నెట్ రన్ రేట్‌తో టాప్‌లో కొనసాగుతోంది. సూపర్ 12లో ఇంగ్లండ్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయినప్పటికీ.. ఇంగ్లండ్ సెమీస్ బెర్త్ ఇప్పటికే ఖాయం అయిపోయింది.
శ్రీలంక సెమీస్‌కు వెళ్లాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. కానీ.. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఓడిపోవడంతో మొత్తం 4 మ్యాచ్‌లు ఆడి ఒక్కటే మ్యాచ్‌లో గెలిచి.. కేవలం 2 పాయింట్లతో నెగెటివ్ నెట్ రన్ రేట్‌ను మూటగట్టుకున్న శ్రీలంక సెమీస్ ఆశలు ఆవిరి అయిపోయినట్టే. శ్రీలంక కూడా మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లో గెలిచినా కూడా శ్రీలంక సెమీస్ చేరడం దాదాపు అసాధ్యం.
England's unbeaten run continues 🔥#T20WorldCup | #ENGvSL | https://t.co/qlHuDOhCpo pic.twitter.com/aKffZ2wBgR
— T20 World Cup (@T20WorldCup) November 1, 2021
Sensational fielding from England 👏
— T20 World Cup (@T20WorldCup) November 1, 2021
Roy and Billings combine brilliantly as Hasaranga's charge comes to an end on 34.#T20WorldCup | #ENGvSL | https://t.co/qlHuDOhCpo