ఇంగ్లండ్ పోటీలోకి
టీ20 ప్రపంచకప్‌లో నాకౌట్ మ్యాచ్‌లు దగ్గరపడుతున్నా కొద్ది సెమీఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. మంగళవారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 20 పరుగుల తేడాతో గెలిచింది.
- న్యూజిలాండ్‌పై అద్భుత విజయం
బ్రిస్బేన్: టీ20 ప్రపంచకప్‌లో నాకౌట్ మ్యాచ్‌లు దగ్గరపడుతున్నా కొద్ది సెమీఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. మంగళవారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 20 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో గ్రూపు-1లో ఐదేసి పాయింట్లతో న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య రేసు రసవత్తరంగా సాగుతున్నది. మ్యాచ్ విషయానికొస్తే..ఇంగ్లండ్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యఛేదనలో కివీస్ 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. వోక్స్(2/33), కరాన్(2/26) విజృంభణతో కివీస్ బ్యాటర్లు తేలిపోయారు. గ్లెన్ ఫిలిప్స్(62), కెప్టెన్ విలియమ్సన్(40) మినహా మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. అంతకుముందు బట్లర్(73), అలెక్స్ హేల్స్(52) అర్ధసెంచరీలతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 179/6 స్కోరు చేసింది. ఫెర్గుసన్(2/45)కు రెండు వికెట్లు దక్కాయి. బట్లర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. మరోమ్యాచ్‌లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. మొదట అఫ్గన్ 144/8 స్కోరు చేయగా, డిసిల్వా (3/13) రాణించాడు. లక్ష్యఛేదనలో ధనంజయ డిసిల్వా(66 నాటౌట్) అర్ధసెంచరీతో లంక 18.3 ఓవర్లలో 148/4 స్కోరు చేసింది. హసరంగకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

