లండన్: స్వదేశంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా మరో మ్యాచ్ మిగిలుండగానే ఇంగ్లండ్ 2-0తో సిరీస్‌ను దక్కించుకుంది. లార్డ్స్‌లో ఆదివారం ముగిసిన రెండో టెస్టులో ఆతిథ్య జట్టు నిర్దేశించిన 389 పరుగుల రికార్డు ఛేదనలో పాక్.. 50.5 ఓవర్లకు 194 రన్స్‌కే చేతులెత్తేసి 194 పరుగుల భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఛేజింగ్‌లో 14 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన ఆ జట్టును సౌద్ షకీల్ (97) గట్టెక్కించే యత్నం చేసినా మిగిలిన బ్యాటర్లు తేలిపోయారు.