10 ఓవర్ల వరకు తడబడుతూ ఆడిన ఇంగ్లండ్.. తర్వాత రెచ్చిపోయింది. 10 ఓవర్లలో కేవలం 47 పరుగులు చేసిన ఇంగ్లండ్.. ఆ తర్వాత రెచ్చిపోయి ఆడింది. దీంతో 15 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. జోస్ బట్లర్ చెలరేగిపోయి ఆడాడు. హాఫ్ సెంచరీ చేసి ఇంగ్లండ్‌కు భారీ స్కోర్‌ను అందించాడు. 49 బంతుల్లో బట్లర్ 63 పరుగులు చేశాడు. 4 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు.
కెప్టెన్ మోర్గాన్ కూడా బ్యాట్‌కు పనిచెబుతున్నాడు. 26 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఒక ఫోర్, ఒక సిక్స్ బాదాడు. ప్రస్తుతం క్రీజులో బట్లర్, మోర్గాన్ ఉన్నారు.
ఓపెన్ జసన్ రాయ్.. 6 బంతుల్లో కేవలం 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మలాన్ 8 బంతుల్లో 6 పరుగులు చేశాడు.