క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ దీటుగా బదులిస్తోంది. యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (132 నాటౌట్) మెరుపు శతకంతో మెరవడంతో ఆ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది.
బ్రూక్‌తో పాటు ఓలీ పోప్ (77), బెన్ డకెట్ (46), కెప్టెన్ బెన్ స్టోక్స్ (37 నాటౌట్) రాణించారు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 319/8తో రెండో రోజు క్రీజులోకి వచ్చిన కివీస్ 348 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ జట్టు ఇంకా 29 పరుగులు వెనుకబడి ఉంది.