టీ20 ప్రపంచకప్‌లో మరో సమరానికి తెర లేచింది. రెండు అత్యుత్తమ జట్ల మధ్య ఇవాళ పోరు జరగనుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ స్టేడియంలో జరగనుంది.
ఇంగ్లండ్ టీమ్‌లో ఎటువంటి మార్పులు లేవు. ఆస్ట్రేలియా టీమ్‌లో మిట్చ్ మార్ష్ బదులు స్పిన్నర్ ఆస్టోన్ అగర్‌ను దించారు.
ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్, ఆరూన్ ఫించ్(కెప్టెన్), స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వాడె(వికెట్ కీపర్), ఆస్టోన్ అగర్, పాట్ కమిన్స్, మిట్చెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్ ఉన్నారు.
ఇంగ్లండ్ టీమ్ నుంచి జాసన్ రాయ్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), డేవిడ్ మలాన్, జానీ బేర్స్టౌ, ఈయొన్ మోర్గాన్, లియామ్ లివింగ్‌స్టోన్, మూయిన్ అలీ, క్రిస్ వోయకెస్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషిద్, టైమల్ మిల్స్ బరిలో ఉన్నారు.
సూపర్ 12 లో గ్రూప్ 1 లో ఇంగ్లండ్ 4 పాయింట్లతో టాప్‌లో ఉంది. ఇప్పటి వరకు 2 మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ 2 మ్యాచ్‌లలో గెలిచింది. ఆస్ట్రేలియా కూడా 2 మ్యాచ్‌లు ఆడి 2 మ్యాచ్‌లలో గెలిచి రెండో స్థానంలో ఉంది. కాకపోతే ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్ ఇంగ్లండ్ కన్నా తక్కువగా ఉంది. ఇంగ్లండ్ నెట్ రన్ రేట్ 3.614 ఉండగా.. ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్ 0.727గా ఉంది. పాయింట్స్ పట్టికలో టాప్‌లో ఉన్న ఈ రెండు జట్టుల్లో ఏది విజయం సాధిస్తుందో చూడాలి.