England team | టీమిండియా రికార్డును బ్రేక్ చేసిన ఇంగ్లండ్.. తొలి సెషన్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఘనత
గతంలో తొలి సెషన్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు భారత జట్టు పేరుమీద ఉంది
England team : టెస్ట్ క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు ప్రపంచ రికార్డు బద్ధలు కొట్టింది. తొలి సెషన్లో ఎక్కువ పరుగులు చేసిన జట్టుగా వరల్డ్ రికార్డు సృష్టించింది. పాకిస్థాన్‌తో రావల్పిండి స్టేడియంలో గురువారం జరుగుతున్న మొదటి టెస్ట్‌లో ఇంగ్లండ్ ఈ ఘనత సాధించింది. 27 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 174 పరుగులు చేసింది. లంచ్ బ్రేక్ సమయానికి ఓపెనర్లు బెన్ డకెట్ 91 పరుగులు, క్రాలే 77 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. గతంలో తొలి సెషన్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు భారత జట్టు పేరుమీద ఉంది. 2008లో అఫ్గానిస్థాన్‌పై టీమిండియా తొలి సెషన్లో 150 రన్స్ చేసింది.
మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించేలా కనిపిస్తోంది. పాక్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఓపెనర్లు జాక్ క్రాలే (122), బెన్ డకెట్ (107) సెంచరీలు సాధించారు. టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి 332 పరుగులు చేసింది. ఇంగ్లండ్ జట్టు 17 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ టూర్‌కు వెళ్లింది. బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో పాక్ గడ్డపై మూడు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

