పెర్త్ : ఇంగ్లండ్,ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్(Mitchell Starc) నిప్పులు చెరిగాడు. ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను ఈజీగా కుప్పకూల్చేశాడు. పెర్త్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్ ఏడు వికెట్లు తీసుకుని ఇంగ్లండ్‌ను దారుణంగా దెబ్బతీశాడు. 58 పరుగులు ఇచ్చిన అతను తన ఖాతాలో ఆ ఏడు వికెట్లు వేసుకున్నాడు. టెస్టు కెరీర్లో అతనికి ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్ కావడం గమనార్హం. క్రాలే, డక్కెట్, రూట్, స్టోక్స్, అట్కిన్సన్, స్మిత్, వుడ్ వికెట్లను తీశాడు స్టార్క్. దీంతో ఇంగ్లండ్ తన ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 172 రన్స్‌కు ఆలౌటైంది.
జూన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులోని ఓ ఇన్నింగ్స్‌లో కేవలం 9 పరుగులు ఇచ్చిన ఆరు వికెట్లు తీసుకున్నాడు ఆసీస్ బౌలర్. ఇప్పుడు ఆ పర్ఫార్మెన్స్ను మెరుగుపరుచుకున్నాడతను. టెస్టుల్లో స్టార్క్ తొలి సారి ఏడు వికెట్లు తీసుకున్నాడు. ఇవాళ తన సెన్షేషనల్ బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడతను. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో స్టార్క్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. కమ్మిన్స్, హేజిల్‌వుడ్ గాయాలతో దూరమైనా.. ప్రధాన పేస్ బౌలర్‌గా స్టార్క్ తన పాత్రను పూర్తిగా పోషించాడు.
ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. అతను 52 రన్స్ చేసి ఔటయ్యాడు. ఓలీ పోప్ 46, జేమీ స్మిత్ 33, బెన్ డక్కెట్ 21 రన్స్ స్కోరు చేశారు.
Career-best figures for Mitch Starc! That is one way to make a statement to kick off the #Ashes.
Live blog: https://t.co/i789gqey3j pic.twitter.com/gIzdOO1ple
— cricket.com.au (@cricketcomau) November 21, 2025